Sports: SRH జట్టులోకి రానున్న రోహిత్ శర్మ ?

Sports: Hit man Rohit Sharma.. The man with a plan
Sports: Hit man Rohit Sharma.. The man with a plan

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ రోహిత్ తిరిగి SRHకు వచ్చేయాలని అతడి తెలుగు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆయన తోలుత హైదరాబాద్ తరపున ఆడారని, 2009లో టైటిల్ కూడా వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు SRHకు మన దేశ స్టార్ ప్లేయర్, కెప్టెన్ అవసరం ఉందని, రోహిత్ చక్కగా సరిపోతారని పోస్టులు చేస్తున్నారు. డిసెంబర్ 19 వేలం తర్వాత కూడా ట్రేడింగ్ కు అవకాశం ఉందని, SRHకు వస్తే బాగుంటుందని చెబుతున్నారు.

కాగా, ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మకు కనీస గౌరవం ఇవ్వలేదని, ఆకస్మాత్తుగా తొలగించారని ఫైర్ అవుతున్నారు. దేశంలోని పలు నగరాల్లో ముంబై జెర్సీలను కాల్చి వేస్తున్నారు. ఇన్ని రోజులు హిట్ మ్యాన్ పై ఇష్టంతోనే ముంబై ఇండియన్స్ ను సపోర్ట్ చేశామని, ఇకనుంచి పట్టించుకోమని పోస్టులు చేస్తున్నారు.