Sports: సచిన్.. సచిన్.. ఇప్పటికీ అదే క్రేజ్.. వీడియో వైరల్

Sports: Sachin.. Sachin.. Still the same craze.. Video viral
Sports: Sachin.. Sachin.. Still the same craze.. Video viral

దాదాపు పాతికేళ్ల క్రికెట్ కెరీర్.. ఆటకు వీడ్కోలు పలికి పదేళ్లు దాటింది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ తెందూల్కర్ క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. ఎక్కడకెళ్లినా అభిమానులు ‘సచిన్.. సచిన్’ అంటూ కేరింతలు కొడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సచిన్.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాడు.

తాజాగా సచిన్ కశ్మీర్ పర్యటనకు వెళ్లాడు. కుటుంబంతో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో.. తోటి ప్రయాణికులంతా ‘సచిన్’ నామస్మరణతో హోరెత్తించారు. అభివాదం చేసిన సచిన్.. ధన్యవాదాలు చెబుతూ సీట్లో కూర్చున్నాడు. ఈ వీడియోను ఎక్స్ యూజర్ పోస్టు చేశారు. ‘కొన్ని విషయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’’ అని క్యాప్షన్ పెట్టారు.