Sports: టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్.. భావోద్వేగానికి లోనైనా తండ్రి

Sports: Sarfaraz Khan, who made his debut in Tests, is an emotional father
Sports: Sarfaraz Khan, who made his debut in Tests, is an emotional father

ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేశారు. ఈ క్రమంలో సర్ఫరాజ్కు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే క్యాప్ అందించారు. ఇది చూస్తూ పక్కనే ఉన్న సర్ఫరాజ్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ అవుతోండగా.. ఇలాంటి క్షణాలే క్రికెట్ను మరింత అందంగా మారుస్తాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సర్ఫరాజ్ తో పాటు ధ్రువ్ జురెల్ ఎంట్రీ ఇచ్చారు.

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన టీమ్ ఇండియా జట్టు… మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.