భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 212 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికా 42.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలకు చేరింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జోర్జీ 119 పరుగులు, హెండ్రిక్స్ 52, డస్సెన్ 36 పరుగులు చేశారు
టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కి దిగిన భారత్ 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆల్ అవుట్ అయింది. సాయి సుదర్శన్ 83 బంతులలో 62 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 56 పరుగులు చేశాడు. రుతురజ్ గైక్వాడ్ 4 పరుగులు మాత్రమే చేశాడు. సంజు సాంసంగ్ 12 పరుగులు చేసి హెండ్రిక్స్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. రింకు సింగ్ (17), కుర్దీప్ యాదవ్ (1)లను కేశవ్ మహరాజ్ వరుస ఓవర్లలో పెవిలియన్కు పంపాడు. అక్షర్ పటేల్ 7 ని మారమ్ ఔట్ చేశాడు. చివర్లో అర్ష్దీప్ సింగ్ 18 పోరాడటంతో స్కోరు 200 దాటింది. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రి బర్గర్ 3, కేశవ్ మహరాజ్ 2, బ్యురాన్ హెండ్రిక్స్ 2, లిజాడ్ విలియమ్స్, మార్క్రమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈనెల 21వ తేదీన 3 వన్డే జరుగుతుంది.