ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు విశాఖలోని వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. 2003లో నిర్మితమైన ఈ స్టేడియంలో ఈ టెస్ట్ మ్యాచ్ మూడోది కానుంది. రెండో టెస్టు కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు విశాఖ ఇప్పటికే చేరుకున్నాయి. అయితే ఇవాల్టి నుంచి విశాఖలో ఇంగ్లండ్ తో జరగబోయే రెండో టెస్టుకు ముందు భారత స్పిన్నర్ అశ్విన్ ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్లో మరో 4 వికెట్లు తీస్తే టెస్టుల్లో 500 వికెట్లు తీసిన తొమ్మిదో మేల్ క్రికెటర్ గా ఆయన నిలుస్తారు. 3 వికెట్లు తీస్తే ఇంగ్లండ్ పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా చరిత్ర సృష్టిస్తారు. కాగా తొలి టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు తీశారు.
భారత్ – ఇంగ్లండ్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన 28 పరుగుల తేడాతో పరాభవం ఎదురు అయిన సంగతి తెలిసిందే.దాదాపు 5 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో టెస్టు మ్యాచ్ ఆడిన భారత జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. అయితే ఐదు రోజులపాటు జరిగే మ్యాచ్‌కు 10 వేల మంది విద్యార్థులకు, 14,250 మంది క్లబ్ క్రీడాకారులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి తెలిపారు.