భారత్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీం ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ రికార్డు నెలకోల్పారు. సౌత్ ఆఫ్రికాలో ఆ జట్టుపై టీ20లో అర్థసెంచరీ చేసిన ఏకైక భారత కెప్టెన్ గా సూర్య(55) అరుదైన ఘనత సాధించారు. అతని తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని(45) దే అత్యధిక స్కోరు.
కాగా, ఈ మ్యాచ్ లో సూర్య 50తో రాణించారు. 36 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 55 పరుగులు బాదారు. కాగా, నిన్నటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలర్ షంసీ సెలబ్రేషన్ వైరల్ అవుతోంది. కీలకంగా సమయంలో సూర్య కుమార్ వికెట్ పడగొట్టిన షంసీ వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. షూను తీసి ఫోన్ నొక్కుతున్నట్టు చెవి దగ్గర పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా గతంలో పలువురు ఆటగాళ్లు కూడా ఇదే తరహా సెలబ్రేషన్ చేసుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.