ఇటీవల రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికాకు వెళ్ళింది. ఈ రెండు టెస్టుల సిరీస్లో దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ మ్యాచ్ గెలవగా, టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్ గెలిచింది .దీంతో టెస్టిస్ సిరీస్ డ్రాగ ముగిసింది. ఒకవేళ మూడు టెస్టులు ఉండి ఉంటే సిరీస్ ఫలితం తేలేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.తాజాగా దీనిపై దక్షిణాఫ్రికా మాజీ సారథి, మిస్టర్ 360గా ఏబీ డివిలియర్స్ టీ20 క్రికెట్ కారణంగానే టెస్టు సిరీస్లు తగ్గాయని అతడు ఆరోపించాడు.
డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘భారత్-సౌత్ ఆఫ్రికా టెస్టు సిరీస్లో మూడో మ్యాచ్ లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్కు పెరుగుతున్న ప్రాధాన్యత వల్ల సిరీస్ ఫలితం తేలలేదని దీనికి ఎవరిని నిందించాలో నాకైతే తెలియడం లేదు. అన్ని టీం లు టెస్టులు ఆడి ఎవరు మెరుగ్గా ఆడతారో తెలియాలంటే అన్ని టీం లకు సమానంగా మ్యాచ్లు నిర్వహించాలి…’ అని ఏబి డివిలియర్స్ అన్నాడు.వచ్చేనెల ఫిబ్రవరిలో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ వేదికగా టెస్ట్ సిరీస్ లో ఆడనుంది. అయితే ఈ సిరీస్ కి దక్షిణాఫ్రికా బోర్డు కీలక ఆటగాళ్లను కాదని గ్రూప్ బి ఆటగాళ్లను ఎంపిక చేయడం ఈ విమర్శలకు తావిచ్చింది.