పాకిస్తాన్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. మళ్లీ కెప్టెన్గా బాబర్ ఆజం నియామకం కానున్నారట. వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శన అనంతరం పాకిస్తాన్ క్రికెట్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు సారధి బాబర్ అజామ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, విదేశీ కోచ్ లను తప్పిస్తూ పిసిబి నిర్ణయం తీసుకుంది. ఇది జరిగిపోయిన కథ.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా అష్రఫ్ పదవిలో ఉన్నప్పుడు చోటు చేసుకున్న సంఘటనలు. జకా అష్రఫ్ పిసిబి చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకోగా, అతని స్థానంలో కొత్తగా మొహ్సిన్ నక్వి ఎన్నికయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగునన్నారు. ఈ క్రమంలో బాబర్ అజామ్ కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కెప్టెన్ గా బాబర్ అజామ్ వైదొలిగిన తర్వాత షాన్ మసూద్ ను టెస్ట్ కెప్టెన్ గా, షాహిన్ ఆఫ్రిదికి టి20 బాధ్యతలు అప్పగించగా, వన్డే క్రికెట్ ను ప్రకటించలేదు. దీంతో మళ్లీ కెప్టెన్గా బాబర్ ఆజం నియామకం కానున్నారట.