భారత్ వర్సెస్ అప్గానిస్తాన్ మధ్య బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో మూడో టీ 20 జరిగింది. భారత్ ఫేవరేట్ గా బరిలోకి దిగింది. అయితే కనీస పోటీ అయినా ఇవ్వాలనే లక్ష్యంతో అప్గానిస్తాన్ అనుకుంది. కానీ వాస్తవానికి అప్పటికే రోహిత్ సేన సిరీస్ గెలవడం వల్ల అది అందరి దృష్టిలో నామమాత్రపు మ్యాచే. కానీ అది ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్ అవుతుందని ఎవ్వరూ కూడా ఊహించలేదు. చివరికీ విజేత టీమిండియా అయినప్పటికీ, అప్గానిస్తాన్ కూడా అద్భుతమైన ఆటతో పోరాడింది.
అంతర్జాతీయ క్రికెట్ లో మ్యాచ్ ఫలితం తొలిసారి రెండో సూపర్ ఓవర్ లో తేలింది. మెరుపు సెంచరీతో కెప్టెన్ రోహిత్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రింకూ సింగ్ ఇన్నింగ్స్ కూడా అమూల్యమైందే. రెండు జట్లు 212 పరుగులు చేయడంతో తొలి మ్యాచ్ టై కాగా, ఆ తరువాత జరిగిన సూపర్ ఓవర్ కూడా టై అయింది. రెండో సూపర్ ఓవర్ లో టీమిండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టీ 20లో విజయం సాధించడం తొలిసారి కావడం విశేషం. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 121, రింకూ సింగ్ 69 (నాటౌట్). భారత్ తొలుత 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు సాధించింది. నైబ్ 55 నాటౌట్. గుర్బాజ్ 50, ఇబ్రహీం జద్రాన్ 50 పరుగులతో చెలరేగడంతో 212 పరుగులు చేసింది.