ఈ ప్రపంచ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తరపున ఆల్ రౌండర్ గా ఆడుతున్న రచిన్ రవీంద్ర అంచనాలకు మించి రాణిస్తూ మ్యాచ్ విన్నర్ గా మారిపోయాడని చెప్పాలి, ఒకవైపు బంతితో మరియు బ్యాట్ తో రాణిస్తూ న్యూజిలాండ్ కు చాలా విలువైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రవీంద్ర 9 మ్యాచ్ లు ఆడగా 70 .62 సగటుతో 565 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మొదటి స్థానాన్ని అందుకున్నాడు. రవీంద్ర ఈ విధంగా రాణిస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. అందుకే ఇతనిపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాయి.
యూఏఈ లో జరగనున్న వేలంలో ఇతన్ని దక్కించుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా సీజన్ లు మారుతున్నా రాత మారని ఫ్రాంఛైజీలుగా ఉన్న పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైద్రాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరులో ఇతన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.