Sports: వామికా బర్త్ డే.. కోహ్లీ, అనుష్కల వీడియో వైరల్..!

Sports: Wamika's birthday.. Kohli, Anushka's video viral..!
Sports: Wamika's birthday.. Kohli, Anushka's video viral..!

ఈరోజు క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల ముద్దుల కూతురు వామికా పుట్టినరోజు. వామికా 2021 జనవరి 11న పుట్టింది ఈరోజు తో వామికా మూడవ సంవత్సరం లోకి అడుగు పెట్టబోతోంది ఈ సందర్భంగా సోషల్ మీడియా లో వామికాకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. అటు కోహ్లీ అభిమానులు ఇటు అనుష్క అభిమానులు కూడా ఆమెకి విషెస్ చెప్తున్నారు.

ఆమె పుట్టిన రోజు సందర్భంగా కోహ్లీ అనుష్క వామికా కి సంబంధించిన ఒక వీడియోని పోస్ట్ చేశారు ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఈరోజు రాత్రి జరిగే తొలి T20కి వ్యక్తిగత కారణాల వలన విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. అయితే కూతురు బర్త్డే కారణంగానే విరాట్ కోహ్లీ మ్యాచ్ కి దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది. వామికా పుట్టినరోజు వేడుకల్ని అనుష్క శర్మ ఘనంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. అలానే ప్రస్తుతం అనుష్క శర్మ ప్రెగ్నెంట్. త్వరలోనే ఈ మరో బిడ్డకి జన్మనివ్వబోతున్నారు.