Sports: వార్నరా.. మజాకా..! హీరోలా ఎంట్రీ ఇవ్వనున్న డేవిడ్ భాయ్

Sports: Warner.. Funny..! David Bhai will make an entry in Herola Helicopter
Sports: Warner.. Funny..! David Bhai will make an entry in Herola Helicopter

టెస్టులకు గుడ్ బై చెప్పిన ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ త్వరలోనే బిగ్ బాష్ లీగ్ లో అలరించనున్నాడు. సిడ్నీ థండర్స్ తరుపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. సిడ్నీ వేదికగా జనవరి 12న సిడ్నీ సిక్సర్స్ తో జరగనున్న మ్యాచ్లో డేవిడ్ భాయ్ ఆడనున్నాడు. అయితే, ఈ మ్యాచ్ కు ముందు హాలీవుడ్ హీరో రేంజ్లో డేవిడ్ వార్నర్ హెలిక్యాప్టర్లో మైదానంలో అడుగుపెట్టనున్నాడు.

జనవరి 12న ఉదయం హంటర్ హ్యలీ ప్రాంతంలో డేవిడ్ వార్నర్ సోదరుడి వివాహ జరగనుంది. ఈ ప్రాంతం మ్యాచ్ జరగాల్సిన సిడ్నీ గ్రౌండ్కు దాదాపు 250 కిలోమీటర్ల దూరం ఉండడంతో సిడ్నీ సిక్చర్స్- సిడ్నీ థండర్స్ మ్యాచ్ కి వివాహాము అనంతరం వార్నర్ ప్రైవేట్ హెలిక్యాప్టర్లో సిడ్నీకి బయలుదేరనున్నాడు.. ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించడానికి ముందే డేవిడ్ వార్నర్ ఎస్సిజి అవుట్ఫోల్డ్లోకి దిగుతాడని సీడ్నీ థండర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.లీగ్ దశలో సీడ్నీ థండర్స్ ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్లు జరిగిన తర్వాత డేవిడ్ భాయ్ దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ కోసం యూఏఈ బయలుదేరుతాడు.