Sports: మళ్లీ టి20 పగ్గాలు చేపట్టబోతున్న విలియమ్సన్.. !

Sports: Williamson is going to take the reins of T20 again.. !
Sports: Williamson is going to take the reins of T20 again.. !

న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మెన్ మళ్లీ టి20 మ్యాచ్ లకి సారథ్యం వహించబోతున్నారు. బంగ్లాదేశ్ జరిగే టి20 సిరీస్ కి విలియమ్సన్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఈరోజు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ తో ఈనెల 27 న ప్రారంభం కాబోయే టి20 సిరీస్ కి 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది.

ఈ సంవత్సరం IPL సీజన్లో గుజరాత్ తరపున ఆడిన విలియమ్సన్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మొదటి మ్యాచ్లో మోకాలు గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత న్యూజిలాండ్ వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాడు. దాదాపు 5 నెలలు రిహాబిలైటేషన్ సెంటర్లో ఉన్నాడు. ఈ సమయంలో అతడు అసలు వరల్డ్ కప్పు ఆడతాడు లేదా అన్న సందేహాలు కలిగాయి. బలమైన దృఢ సంకల్పం ఉన్న కారణంగా మళ్లీ భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఆడి 256 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్ స్క్వాడ్ : ఫిన్ అలెన్, కేన్ విలియ‌మ్స‌న్(కెప్టెన్), కైలీ జేమీస‌న్, మార్క్ చాప్‌మ‌న్, అడ‌మ్ మిల్నే, డారిల్ మిచెల్, జేమ్స్ నీషం, గ్లెన్ ఫిలిఫ్స్, మిచెల్ శాంట్న‌ర్, బెన్ సియ‌ర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ.