జింబాబ్వేలో భారత జట్టు పర్యటించనున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ ఏడాది జూన్లో జరగబోయే టి20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా నేరుగా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ మేరకు బీసీసీఐ, జింబాబ్వే క్రికెట్ బోర్డులు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఐదు టీ20 మ్యాచ్‌లలో భాగంగా… అక్కడ జులై 6 నుంచి 14 దాకా జరుగబోయే ఈ సిరీస్‌లో పాల్గొననుంది.ఈ మేరకు జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచులు ఆడనుంది.
బీసీసీఐతో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ సిరీస్ ఖరారైనట్లు జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.కాగా.. జింబాబ్వేతో ఇండియా మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో గెలిచింది.తొలిసారిగా జింబాబ్వేతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.