Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘శ్రీమంతుడు’ ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేష్‌బాబు స్థాయి ఒక్కసారిగా పెరిగి పోయింది. ఆ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఆ తర్వాత వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు. ఒక విభిన్నమైన కుటుంబ కథా చిత్రంతో ఆ సినిమా రూపొందిందని అంతా భావించారు. అయితే ఆ సినిమా కథే లేకుండా తెరకెక్కింది. మహేష్‌బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ ఫ్లాప్‌గా నిలిచింది. పెట్టిన పెట్టుబడిలో కనీసం 25 శాతం కూడా రాలేదని అప్పుడు ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి కూడా పు సందర్బాల్లో సన్నిహితుల వద్ద ఒప్పుకున్నాడు. నిర్మాతకు పెద్దగా నష్టం లేకపోయినా కూడా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం తీవ్రంగా నష్టపోయారు.
బ్రహ్మోత్సవం తర్వాత మరోసారి స్పైడర్ చిత్రంతో అదే ఫలితాన్ని మహేష్‌బాబు చవిచూడబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఎన్నో అంచనాల నడుమ దాదాపు 110 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, 125 కోట్లకు అమ్ముడు పోయిన స్పైడర్ చిత్రం నిర్మాతలను తేల్చినా డిస్ట్రిబ్యూటర్లను మాత్రం పూర్తిగా ముంచేసింది. అన్ని ఏరియాల్లో కలిపి 125 కోట్లకు అమ్ముడు పోగా ఇప్పుడు 30 నుండి 40 కోట్ల షేర్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే బ్రహ్మోత్సవం కంటే కూడా ఇది పెద్ద ఫ్లాప్ అంటూ ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తన రికార్డును తానే ఈ చిత్రంతో మహేష్‌బాబు బ్రేక్ చేసుకున్నాడు.
సూపర్ స్టార్ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబో మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. కాని అంచనాలను అందుకునేలా దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాను రూపొందించడంలో విఫలం అయ్యాడు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆధరిస్తారని ముందు నుండి భావించిన చిత్ర యూనిట్ సభ్యులకు ప్రేక్షకులు షాక్ ఇచ్చారు. మహేష్‌బాబు కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా ఈ సినిమాల నిలవడంతో ఫ్యాన్స్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకుని 250 కోట్లు వసూళ్లు చేస్తుందని ఆశించిన ఈ సినిమా ఇలాంటి ఫలితాన్ని పొందడంతో వారు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.