ప్రేమలో ఉన్న ప్రముఖ యాంకర్స్

ప్రేమలో ఉన్న ప్రముఖ యాంకర్స్

బుల్లితెరపై స్టార్‌ యాంకర్లుగా దూసుకుపోతున్నారు యాంకర్‌ ప్రదీప్‌ అండ్‌ శ్రీముఖి. తెరపై వీళ్లిద్దరు చేసే హంగామా మాములుగా ఉండదు. అందుకే వీరు జంటగా హోస్ట్‌ చేసిన షోలు టీఆర్పీ రేటింగ్‌లోనూ టాప్‌ రేంజ్‌లో ఉంటాయి. ఇక ఓ వైపు రియాలిటీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలతో అలరిస్తున్న ప్రదీప్‌-శ్రీముఖి మధ్య ఏదో ఉందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి తోడు శ్రీముఖి యాంకర్‌గా ప్రస్థానం మొదలుపెట్టింది కూడా ప్రదీప్‌తోనని, దీంతో అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని టాక్‌. ఇద్దరి మధ్యా ఉన్నది ఫ్రెండిష్‌ మాత్రమే కాదని, ఇంకా ఏదో ఉందనే పలు ఊహాగానాలు తెరపైకి వచ్చినా అలాంటిదేమీ లేదని ఇద్దరూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

అయితే తాజాగా శ్రీముఖి..ప్రదీప్‌పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టేసింది. లేటెస్ట్‌గా ఓ షోలో పాల్గొన్న శ్రీముఖి..అందరూ చూస్తుండగానే యాంకర్‌ ప్రదీప్‌కు ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్‌ చేసింది. ‘అందాలలో అహో మహోదయం’ అనే పాటతో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి సిగ్గుపడుతూ వచ్చి తన మనసులో మాటను బయటపెట్టింది.

దీనికి ప్రదీప్‌ కూడా సరే అన్నట్లుగా ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. దీంతో సోషల్‌ మీడియాలో ఈ జోడీ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ కొందరు కామెంట్‌ చేస్తుంటే, కేవలం షో కోసం ఇలా చేస్తున్నారేమో అంటూ మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.