ప్రియమైన వాడితో పెళ్లి కి సిద్ధం అయిన శ్రీముఖి… ఎప్పుడంటే..?

ప్రియమైన వాడితో పెళ్లి కి సిద్ధం అయిన శ్రీముఖి… ఎప్పుడంటే..?
Latest News

శ్రీముఖి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు . శ్రీముఖి బుల్లితెర మీద జరిగే షోలలో కనపడి ఆకట్టుకుంటూ ఉంటుంది. అలానే బిగ్ బాస్ కి కూడా వెళ్లి ఈమె ఎక్కువ ఫాలోయింగ్ ని పెంచుకుంది. బిజీ యాంకర్ గా శ్రీముఖి ప్రస్తుతం కొనసాగుతోంది. సుమ తర్వాత టాప్ ప్లేస్ లో ఉంది శ్రీముఖి. శ్రీముఖి కి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడతాయి ముఖ్యంగా ఆమె పెళ్లి విషయం గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూనే ఉంటాయి. గత కొద్ది రోజులుగా పెళ్లి విషయాన్ని ఆమె దాటేస్తోంది. శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట.

ప్రియమైన వాడితో పెళ్లి కి సిద్ధం అయిన శ్రీముఖి… ఎప్పుడంటే..?
Sreemukhi

శ్రీముఖి లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది . గత కొద్దిరోజులుగా ఒక అబ్బాయిని ఆమె ప్రేమిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఆ వివరాలని తెలియకుండా ఆమె జాగ్రత్త పడుతోంది. ఇంట్లో వాళ్లకి చెప్పి వీళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పైగా శ్రీముఖి తండ్రి కూడా పెళ్లి ఆలస్యం కావడం మంచిది కాదని అన్నారు . చాలా రోజుల నుండి శ్రీముఖి పెళ్లి వార్తలని దాచిపెడుతుంది. మరి ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది ఎప్పుడు పెళ్లి చేసుకోబోతోంది అనే వివరాలు మాత్రం తెలియదు.