మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో సన్నీని సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాదు, అతడిని ఎవరైనా ఏమైనా అంటే వారికి గట్టి కౌంటర్లు విసురుతున్నాడు. హౌస్‌లో సన్నీ ఎవిక్షన్ ఫ్రీపాస్ గెలుచుకుంటే ఎవరూ దాన్ని సెలబ్రేట్ చేయలేదని సెటైర్ విసిరాడు షణ్ను. దీనిపై విశ్వక్ రియాక్ట్ అవుతూ.. మేము చేసుకుంటున్నాంలే.. అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు.
తాజాగా నామినేషన్స్ జరిగిన తీరుపై కూడా రియాక్ట్ అయ్యాడు. నిన్నటి నామినేషన్స్‌లో సన్నీకి శ్రీరామచంద్ర, రవిలతో ఫైట్ జరిగింది. ఈ గొడవలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది పక్కన పెడితే విశ్వక్ ఎప్పటిలాగే సన్నీకి సపోర్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా రవి, శ్రీరామచంద్రలపై సెటైర్లు విసిరాడు.
శ్రీరామచంద్ర అటూఇటూ తిరుగుతుంటే షుగర్ వచ్చిందేమోనని కౌంటర్ వేయగా రవికి ఓవర్ స్మార్ట్ షుగర్ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. అయితే సపోర్ట్ చేయడం ఓకే కానీ మధ్యలో మా వాళ్లను ఎందుకు తిడుతున్నారని అటు శ్రీరామ్, ఇటు రవి ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వాళ్లకన్నా ముందు నీకు షుగర్ వచ్చినట్లుందంటూ పరుష పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు.