“గేమ్ చేంజర్” శ్రీరామచంద్ర

"గేమ్ చేంజర్" శ్రీరామచంద్ర

ప్రస్తుతం శ్రీరామచంద్ర బిగ్‌బాస్‌ సీజన్‌-5లో కంటెస్టెంటుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే శ్రీరామ్‌ అంటే గొట్టని వాళ్లు, ఇతర కంటెస్టెంట్ల ఫాలోవర్లు ప్రస్తుతం శ్రీరెడ్డిని ఆయుధంగా చేసుకొని శ్రీరామ్‌ని సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేశారు. ఇది శ్రీరామచంద్రుడి భాగోతం..అతడికి సపోర్ట్‌ చేయకండి అంటూ సోషల్‌ మీడియాలో అతనిపై విషం చిమ్ముతున్నారు.

కండబలంతోపాటు బుద్ధిబలాన్ని కూడా ప్రదర్శిస్తూ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా శ్రీరామచంద్ర తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో వాట్సాప్‌ చాట్‌ మరోసారి తెరమీదకి రావడం అతని ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేస్తుందంటూ శ్రీరామ్‌ ఫాలోవర్స్‌ మండిపడుతున్నారు. మరోవైపు శ్రీరామచంద్రకు తమ మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

ఇక విశ్వ ఎలిమినేషన్‌ సమయం లో శ్రీరామ్‌ గురించి చెప్తూ ఎమోషనల్‌ అయ్యాడు . తాను కోల్పోయిన తమ్ముడిని శ్రీరామ్‌లో చూసుకుంటున్నాననంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని ఈ సీజన్‌కు విన్నర్‌గా మొదటి స్థానంలో చూడాలని భావిస్తున్నా అని చెప్పాడు.మరియు శ్రీరామ్‌ “గేమ్ చేంజర్” అని చెప్పాడు. దానికి శ్రీరామ్‌ ఫాలోవర్స్‌ మద్దతు తెలుపుతూ శ్రీరామ్‌ “గేమ్ చేంజర్” అని పోస్టులు పెడుతున్నారు.