సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ జగన్ పార్టీ ల అభిమానుల మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. పవన్ మీద జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్‌పై జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగటంతో పవన్ ఫ్యాన్స్ చెలరేగిపోతున్నారు. జగన్ భార్య భారతి , చెల్లెలు షర్మిలను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అసభ్యకరమైన రీతిలో ట్రోలింగ్స్ చేస్తూ ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు. అయితే పవన్ స్పందించి జగన్ కుటుంబీకుల జోలికి వెళ్లోద్దని పవన్ తన ఫ్యాన్స్ కి ఒక విజ్ఞప్తి కూడా చేశాడు.
అయితే ఈ మధ్యలో జగన్, పవన్ ఫ్యాన్స్ మధ్య మరింత వేడి రాజేస్తూ పానకంలో పుడకలా ఎంటర్ అయ్యింది నటి శ్రీరెడ్డి. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ సందర్భం వచ్చిన ప్రతిసారి పవన్‌ని విమర్శిస్తున్న శ్రీరెడ్డి పవన్ పై విమర్శలు చేస్తూ… చిరంజీవి గారి పెద్దమ్మాయికి ఎన్ని ఎంగేజ్మెంట్లు అని అడిగామా ? శ్రీజాకి ఎన్ని పెళ్ళిళ్ళని అడిగామా ? లేదు ఎందుకంటే మాకు ఆడవాళ్ళూ అంటే గౌరవం అని, పవన్ కళ్యాణ్‌కు పెళ్లిళ్లుపై ఉన్న శ్రద్ధ ఏపీ స్పెషల్ స్టేటస్‌పై ఉంటే మోదీ ఎప్పుడో ఇచ్చేసేవారని, మధ్యలో షర్మిళ ఏం చేసిందిరా ఆడోళ్ల జోలికొస్తున్నారు ఎదవ మూక అంటూ ‘తలా తోక లేని జనసేన పార్టీకి నమస్సులు’ అంటూ ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చి జనసేన పార్టీపైన, ఆ పార్టీ నాయకులపైన ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది శ్రీ రెడ్డి.