దర్శకుడిని భయపెడుతున్న శ్రీరెడ్డి

Sri Reddy may leaks directors illegal photos

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

శ్రీరెడ్డి వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్‌ను వణికిస్తోంది. ఆమె చేస్తున్న ఆరోపణలు పలువురికి షాకింగ్‌గా ఉన్నాయి. ఇప్పటికే దర్శకుడు శేఖర్‌ కమ్ముల, హీరో నాని, ఇంకా వైవా హర్ష, శ్రీరామ చంద్రలపై శ్రీరెడ్డి ఆరోపణలు చేయడం జరిగింది. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. తాజాగా సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌పై ఆరోపణలు చేయడంతో పాటు ఫొటో సాక్ష్యాధారాలను కూడా సమర్పించింది. దాంతో శ్రీరెడ్డి ముందు ముందు మరెన్ని విషయాలను బయట పెడుతుందో అని అంతా బయపడుతున్నారు. శ్రీరెడ్డి లిస్ట్‌లో ముగ్గురు స్టార్‌ దర్శకులు ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ ముగ్గురు స్టార్‌ దర్శకుల్లో ఇటీవలే ఒక దర్శకుడు సక్సెస్‌ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ ముగ్గురు కూడా శ్రీరెడ్డితో అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్య వాట్సప్‌ చాట్‌ చేయడం జరిగిందట. దాంతో ఆ ముగ్గురు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ శ్రీరెడ్డి వైపు చూస్తున్నారు. ఆమె ఏ సమయంలో ఎలాంటి బాంబును పేల్చుతుందో అని అంతా ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. ఆ ముగ్గురు దర్శకులు మాత్రమే కాకుండా ఇంకా పలువురు కూడా శ్రీరెడ్డి బారిన పడటం ఖాయం అని ఆందోళనలో ఉన్నారు. నిన్న అభిరామ్‌ను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి త్వరలోనే మరింత మందిని బజారుకు ఈడ్చుతాను అంటూ ప్రకటించింది. మరి ఆ మరింత మందిలో మొదట ఎవరి పేరు వస్తుందో చూడాలి. శ్రీలీక్స్‌ పేరుతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్స్‌ అవుతున్నాయి.