శ్రీదేవి మృతదేహం ఇప్పట్లో రానట్లేనా?

Sridevi's body to be flown back to India today

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో ఆమె అభిమానులు మరియు ఇండియన్‌ సినీ పరిశ్రమ మొత్తం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె పార్దీవ దేహాన్ని చివరిసారి చూసేందుకు సినీ వర్గాల వారు చాలా ఆసక్తిగా ఉన్నారు. దుబాయిలో మరణించిన ఆమె మృతదేహం ఇప్పట్లో ఇండియాకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఆమెది సహజ మరణం కాదని అక్కడ పోలీసులు వాదిస్తున్నారు. దుబాయి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్షలను అక్కడ విధిస్తారనే విషయం తెల్సిందే. అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉండటం వల్లే నేరాలు చాలా తక్కువగా జరుగుతాయి. అక్కడ ఏదైనా కేసు విచారణలో అక్కడి రాజు కూడా జోక్యం చేసుకునే మీ ఉండదు. అంతటి కఠిన చట్టాలు ఉన్న నేపథ్యంలో శ్రీదేవి మృతదేహంను ఇక్కడకు తీసుకు రావడం చాలా కష్టతరం అవుతుంది.

శ్రీదేవి మొదట హార్ట్‌ ఎటాక్‌తో మరణించిందని భావించారు. కాని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆమె మద్యం మత్తులో బాత్‌ టబ్‌లో పడి ఊపిరి ఆడక మరణించినట్లుగా వెళ్లడైంది. దాంతో విచారణ మరో విధంగా జరపాలని పోలీసులు భావిస్తున్నారు. బాత్‌ టబ్‌లో శ్రీదేవి సహజంగా పడినదా లేక ఆమెను ఎవరైనా నెట్టి వేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తానికి శ్రీదేవి మృతికి సంబంధించిన విచారణ పూర్తి అయిన తర్వాతే కుటుంబ సభ్యులకు మృతదేహంను అప్పగించే అవకాశం ఉందని అక్కడ అధికారులు చెబుతున్నారు. దాంతో శ్రీదేవి మృతదేహం ఇండియాకు వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. దుబాయి ప్రభుత్వంతో ఇండియన్‌ ప్రభుత్వం చర్చలు జరిపినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదట. శ్రీదేవి మృతదేహం కోసం ఆమె అభిమానులు మరియు కుటుంబ సభ్యులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.