ఈ మధ్య ఏ ప్రమాదాలు చూసినా వలస కూలీలు మృతి చెందుతూనే ఉన్నారు. తమ జీవీతాల పై మృత్యువు కబలించినట్లు ఉంటుంది.ఎటు చూసినా వారు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో జిల్లాలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని స్థానిక బాలిగాం వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 33 మందికి గాయాలయ్యాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన వలసకూలీలు కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని వారి వారి సొంతూళ్లకు వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది.