‘గుంటూరు కారం’ పైనే శ్రీలీల ఆశలు !

‘గుంటూరు కారం’ పైనే శ్రీలీల ఆశలు !
Sreeleela

స్కంద‌, ఆదికేశ‌వ‌, ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమాలు శ్రీలీల కెరీర్ గ్రాఫ్ ని పెంచ‌క‌పోగా, త‌గ్గించాయి. అందుకే, మ‌హేష్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ గుంటూరు కారం సినిమా పైనే శ్రీలీల త‌న ఆశ‌ల‌ను పెట్టుకున్నది . మరి గుంటూరు కారం సినిమా శ్రీలీల‌కు ఏ రేంజ్ హిట్ ని అందిస్తోందో చూడాలి. ఇక ఈ సినిమా యాక్షన్ జోన‌ర్‌ లో న‌డిచే క‌థ అయినప్పటికీ.. కామెడీ ట్రాక్ కూడా హిలేరియ‌స్‌ గా ఉంటుందంట .

‘గుంటూరు కారం’ పైనే శ్రీలీల ఆశలు !
Guntur Karam ” Sreeleela”

ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జ‌న‌వ‌రి 12, 2024న రిలీజ్ కానున్నది . ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని పూజా హెగ్డే స్థానంలో తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే, గుంటూరు కారం సినిమా లో మీనాక్షి చౌదరి పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తోందంట . కాగా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది . ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాదంట . హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా మ‌హేష్ కెరీర్లో 28వ సినిమాగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.