తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి శాంతమ్మ గుండెపోటుతో మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో మృతి చెందారు.
అయితే ఆమె అంత్యక్రియలు మహబూబ్‌నగర్‌లోని వారి వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నుట్ల కుటుంబ సభ్యులు తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.