‘శ్రీనివాస కళ్యాణం’ ప్రివ్యూ

Srinivasa Kalyanam Movie Preview

నితిన్‌, రాశిఖన్నా జంటగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంపై సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. గత సంవత్సరం విడుదలైన శతమానం భవతి చిత్రంతో జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకున్న దిల్‌రాజు మరియు సతీష్‌ వేగేశ్నలు అదే రీతిలో ఫ్యామిలీ ఓరియంటెడ్‌ చిత్రాన్ని వీరిద్దరు తీసుకు వస్తున్నారు. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం అప్పుడే సగం విజయాన్ని సొంతం చేసుకుంది.

Srinivasa Kalyanam Movie

సినిమా ఎలా ఉన్నా కూడా ఒక సారి ఈ చిత్రాన్ని చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. భారీ ఎత్తున ప్రచారం చేయడంతో పాటు, సినిమాకు పాజిటివ్‌ బజ్‌ ఉన్న కారణంగా మంచి బిజినెస్‌ అయ్యింది. అన్ని ఏరియాల్లో కూడా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రంకు పోటీగా వస్తుందని భావించిన విశ్వరూపం 2 చిత్రం విడుదల వాయిదా పడటం జరిగింది. కరుణానిధి మరణంతో విశ్వరూపం 2 చిత్రం విడుదల అవ్వడం లేదు. దాంతో ఈ చిత్రంకు ప్లస్‌ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. సునాయాసంగా ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను నమోదు చేస్తుందని, దాంతో పాటు ఈ చిత్రం నితిన్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రంగా రికార్డు సాధిస్తుందనే నమ్మకం కూడా వ్యక్తం అవుతుంది.