ఎన్టీఆర్‌ జడ్జ్‌మెంట్‌ సూపర్‌…!

Srinivasa Kalyanam Script Rejected by NTR

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో దిల్‌రాజు ఒక చిత్రాన్ని చేసేందుకు డేట్లు అడిగాడు. మొదట కథ చెబితే అప్పుడు డేట్ల గురించి ఆలోచిస్తాను అంటూ చెప్పడంతో సతీష్‌ వేగేశ్నతో ఒక కథ చెప్పించాడు. ‘శతమానంభవతి’ చిత్ర దర్శకుడు అయిన సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో అనగానే ఎన్టీఆర్‌ కాస్త ఆసక్తి చూపించాడు. ఎన్టీఆర్‌కు తగ్గట్లుగా ఉంటుందని చెబుతూ దర్శకుడు సతీష్‌ వేగేశ్న మరియు దిల్‌రాజులు ఒక కథ చెప్పడం జరిగింది. తప్పకుండా ఎన్టీఆర్‌ ఒప్పుకుంటాడు అంటూ దిల్‌రాజు నమ్మాడు. అందుకే మీడియాకు ఎన్టీఆర్‌తో మూవీ చేయబోతున్నట్లుగా లీక్‌ు కూడా ఇచ్చాడు. కథ విన్న తర్వాత ఎన్టీఆర్‌ ఆలోచిస్తాను అంటూ రెండు రోజుల సమయం తీసుకున్నాడు.

Srinivasa Kalyanam Script Rejected by NTR

ఎన్టీఆర్‌ నుండి గుడ్‌ న్యూస్‌ వింటాను అని భావించిన దిల్‌రాజుకు షాక్‌ తలిగింది. సతీష్‌ వేగేశ్న చెప్పిన కథ నాకు సూట్‌ అవ్వదని, మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆ చిత్రాన్ని చేయవచ్చు కాని నేను చేస్తే మాత్రం పోతుందని చెప్పేశాడు. దాంతో రాజుగారు ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఎన్టీఆర్‌ కన్విన్స్‌ అవ్వలేదు. దాంతో ఆ కథను నితిన్‌ వద్దకు తీసుకు రావడం, నితిన్‌ ఓకే చెప్పడం, సినిమా తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేయడం అన్ని చకచక జరిగాయి. ఆ సినిమా ఏంటో అర్థం అయ్యింది కదా.. అదే శ్రీనివాస కళ్యాణం. ఎన్టీఆర్‌ నో చెప్పడం చాలా మంచిది అయ్యిందని ఫ్యాన్స్‌ మరియు నిర్మాత దిల్‌రాజు కూడా భావిస్తున్నాడు. ఎన్టీఆర్‌తో ఆ సినిమా చేసి ఉంటే భారీ పారితోషికంతో చేయాల్సి వచ్చేదని, దాంతో నష్టాలు ఎక్కువగా ఉండేవి అంటూ దిల్‌రాజు అండ్‌ టీం భావిస్తున్నారు. ఎన్టీఆర్‌ జడ్జ్‌మెంట్‌ విషయంలో సూపర్‌ అంటూ ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Srinivasa Kalyanam Script Rejected by NTR