పార్టీ గుర్తు ప్రకటించిన పవన్…!

Pawan Kalyan Announces Fist As Janasena Symbol

ఎట్టకేలకు జనసేన పార్టీ గుర్తును ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. జనసేన పార్టీ గుర్తును పిడికిలి గా పార్టీ కార్యవర్గం నిశ్చయించిందని ఆయన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు సభలో ప్రకటించారు. సమాజంలో ఐకమత్యానికి చిహ్నంగా ఈ పిడికిలి గుర్తు ఉంటుందని కులమతాలకతీతంగా అందరూ కలసికట్టుగా ఉండి బలాన్ని చూపించాలంటే.. పిడికిలి చూపించాల్సి ఉంటుందని, అందుకే ఈ గుర్తును ఎంపిక చేశామని పవన్ అన్నారు.

Pawan Kalyan Announces Fist As Janasena Symbol

అలాగే “రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విఫలయమయ్యారని, అది వదిలేద్దాం కనీసం నిడదవోలుకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా సాధించలేకపోయారని ఎన్నో ఏళ్లుగా నిడదవోలు ప్రజలు కోరుతున్నా.. ఈ బ్రిడ్జి విషయంలో ఎంపీ మురళీ మోహన్ గారు శ్రద్ధ చూపడం లేదని పవన్ విమర్శించారు. రైళ్లు ఎప్పుడు వస్తాయో చూసుకొని బయటకు రావాల్సిన పరిస్థితుల్లో నిడదవోలు ప్రజలున్నారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Pawan Kalyan Announces Fist As Janasena Symbol