రాజమౌళి మౌనంలో మర్మం ఏంటబ్బా?

rajamouli comment on sridevi to demand sivagami character in bahubali

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలు ఎంత లౌడ్ గా వెండితెర మీద, బయటా మాట్లాడుతాయో ఆయన అంత సైలెంట్ గా వుంటారు. సక్సెస్ తో పాటు వినయవిధేయతలు కూడా ఆయనకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు సైతం అంత హిట్లు ఇచ్చి ఇంత సైలెంట్ గా ఎలా ఉండటం ఎలా సాధ్యమని బహిరంగ వేదికల మీదే అడిగిన విషయం అందరికీ తెలుసు. సక్సెస్ తర్వాత వచ్చే ఆ మౌనం రాజమౌళికి భూషణం. కానీ సీనియర్ నటి శ్రీదేవి మాటల తర్వాత రాజమౌళి మౌనం ఆభరణంలా గాక అనుమానం రేకెత్తిస్తోంది.

ఎప్పుడూ ఎవరి మీద దూకుడుగా మాట్లాడే అలవాటు లేని రాజమౌళి ఆర్కే ఓపెన్ హార్ట్ లో బాహుబలి కోసం శ్రీదేవిని సంప్రదిస్తే ఆమె 7 కోట్లు పారితోషికం, షూటింగ్ కి వచ్చిన ప్రతిసారి 5 సూట్ రూమ్స్ బుక్ చేయాలని కోరడంతో పాటు హిందీ వెర్షన్ లాభాల్లో భాగం అడిగినట్టు రాజమౌళి చెప్పారు. ఎప్పుడూ ఏ వివాదాస్పద అంశం మీద నోరు విప్పని రాజమౌళి ఇలా మాట్లాడడం, దీని పై శ్రీదేవి స్పందించకపోవడంతో అందరూ ఓపెన్ హార్ట్ లో ఆయన నిజాలే చెప్పి వుంటారు అనుకున్నారు. అటు జాతీయ మీడియా సైతం ఎన్నిసార్లు ఈ విషయం మీద శ్రీదేవిని అడిగినా ఆమె నోరు విప్పకపోవడంతో అందరి వేళ్ళు ఆమె వైపే చూపసాగాయి. అయితే మామ్ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన శ్రీదేవి ఓ ఇంటర్వ్యూ లో రాజమౌళి గురించి, బాహుబలి ఆఫర్ గురించి నోరు విప్పారు.

సినిమా కధ, కథనాలకు సంబంధించి తప్ప ఆర్ధిక అంశాల మీద రాజమౌళి చెప్పిన మాటల్లో నిజం లేదని శ్రీదేవి తేల్చేశారు. పైగా నిర్మాతలు ఏదో చెపితే అది నమ్మి బయటికి ఇలా మాట్లాడొచ్చా అని శ్రీదేవి అడిగేసరికి రాజమౌళి డిఫెన్స్ లో పడ్డారు. ఏది నిజమో, ఏది అబద్ధమో కానీ శ్రీదేవి మాట్లాడాక రాజమౌళి సైలెంట్ గా ఉండటం ఆయన్ని అభిమానించే వాళ్లకి నచ్చడం లేదు. ఇక ఆయనంటే పడనివాళ్ళు ఆ మౌనం వెనుక మర్మం ఏంటని ఇప్పటికే అంటున్నారు. ప్రస్తుతం సాగుతున్న ఎపిసోడ్ తప్ప ఇటు రాజమౌళి కానీ అటు శ్రీదేవి కానీ వివాదాల జోలికి వెళ్ళింది లేదు . ఇప్పుడు వచ్చిన చిన్నిపాటి మాట తేడాతో ఆ ఇద్దరి మధ్య మంట పెట్టి కొందరు చలి కాచుకోవాలనుకుంటున్నారు. పైగా ఈ తేనె తుట్టెని ముందుగా రేపింది రాజమౌళి కాబట్టి శ్రీదేవి ప్రకటనపై స్పందించి, ఈ వివాదం ఇంకా కొనసాగకుండా బ్రేక్ వేస్తే బాగుంటుంది.

మరిన్నివార్తలు 

భరత్ జీవితం నేర్పిన పాఠం.

అనుష్క పక్కన ధన్‌రాజ్‌కు ఏం పని?

ఎన్టీఆర్ బెడ్ రూమ్ లో కెమెరాలు.