టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ మొదటి పార్ట్ విడుదల సమయంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ అంటూ చెప్పుకొచ్చాడు. అప్పటి నుండి కూడా మీడియాలో ఆ విషయమై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. మహాభారతంలోని ఏదో ఒక ఘట్టాన్ని తీసుకుని సినిమా చేయాలనేది తన కోరిక అంటూ చెప్పుకొచ్చాడు. తప్పకుండా మహాభారతం సినిమాను తీస్తానని, అయితే అందుకోసం తాను ఇంకా అనుభవజ్ఞుడిని కావాలని, అలాగే మహాభారతం సినిమాను తెరకెక్కించేందుకు ఇంకా టెక్నాలజీ పెరగాలని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని రాజమౌళి కొన్ని సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా రాజమౌళి మాట మార్చాడు.
గత మూడు సంవత్సరాలుగా రాజమౌళి మహాభారతం ఎప్పుడు తీస్తాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహాభారతం సినిమా పది సంవత్సరాల్లో ఉంటుందని అప్పుడు రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇప్పటికే మూడు సంవత్సరాలు పూర్తి అయ్యింది. మరి కొన్ని సంవత్సరాల్లో మహాభారతంను జక్కన్న మొదలు పెడతాడని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని రాజమౌళి ఈ సమయంలో షాకింగ్ వ్యాఖ్యలు చేసి అందరి ఆశపై నీళ్లు జల్లాడు. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన రాజమౌళి తాను ‘మహాభారతం’ సినిమా చేయబోతున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, తనకు మహాభారతం సినిమా చేయాలనేది కల అని చెప్పాను తప్ప, ఎప్పుడు కూడా నేను మహాభారతం తీస్తాను అని చెప్పలేదు.
రాజమౌళి వంటి దర్శకుడు ఏది కల కన్నా కూడా తీసేయవచ్చు. ఆయనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసేందుకు అందరు ముందు ఉంటారు. నిర్మాతలు, హీరోలు, హీరోయిన్స్ ఇలా అంతా కూడా ఆయనకు వెన్ను దన్నుగా నిలుస్తారు. అలాంటప్పుడు ఆయన కల ఎందుకు నెరవేరదు అంటున్నారు. కాని రాజమౌళి మాత్రం తాను కల కంటున్న కాని సినిమా తీయడం లేదు అంటున్నాడు. రాజమౌళి మాటల్లో అర్థం ఏంటో అర్థం అవ్వడం లేదని సినీ వర్గాల వారు కూడా అంటున్నారు. మహాభారతం తీయాలనే ఆశ ఉన్నా కూడా రాజమౌళి మహాభారతం తీయడని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుంది. ఇక రాజమౌళి తర్వాత సినిమా మహేష్‌బాబుతో ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఆ విషయంపై కూడా రాజమౌళి క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా తాను ఏ సినిమాను మొదలు పెట్టలేదని, త్వరలోనే ఒక ప్రకటన చేస్తాను అంటూ మాత్రం చెప్పుకొచ్చాడు.