‘స్పిరిట్’ సినిమా లో ఛాన్స్ అడిగిన స్టార్ డైరెక్టర్

Star director asks for a chance in the movie 'Spirit'
Star director asks for a chance in the movie 'Spirit'

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌లో భారీ అంచనాలు ఉన్న మూవీ ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఒక పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఐతే, ‘స్పిరిట్’ మూవీ లో నటించే అవకాశం ఇవ్వమని సందీప్ రెడ్డి వంగాని తాను అడిగినట్లు అనిల్ రావిపూడి చెప్పారు. అయితే సందీప్ రెడ్డి వంగా మాత్రం అనిల్ రిక్వెస్ట్ కి నవ్వుతూ ‘మీరు మాకు దొరకరు. మూవీ తర్వాత మూవీ చేస్తావు . యాక్టింగ్ చేసే గ్యాప్ ఇచ్చుకుంటావా ?’ అని అన్నారట. ఈ విషయాన్ని కూడా అనిల్ రావిపూడి తెలిపారు.

Star director asks for a chance in the movie 'Spirit'
Star director asks for a chance in the movie ‘Spirit’

అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా మూవీ ల గురించి కూడా కామెంట్స్ చేస్తూ.. ‘నేను సందీప్‌లా మూవీ లు తీయలేను. అదేవిధంగా నాలా సందీప్ రెడ్డి వంగా కూడా మూవీ లు తీయలేడు’ అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఇక స్పిరిట్ మూవీ విషయానికి వస్తే..ఈ మూవీ ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న మూవీ రాబోతుందని తెలుస్తోంది. అన్నట్టు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీ కోసం ఇప్పటికే సాంగ్స్ ని కంపోజ్ చేయడం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.