కొరటాల వెనుక క్యూ కడుతున్నారు

star heroes interesting on koratala siva direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘మిర్చి’ చిత్రంతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కొరటాల శివ ఆ తర్వాత వరుసగా భారీ విజయాలను దక్కించుకుంటూ వస్తున్నాడు. ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్‌’తో మహేష్‌బాబు మరియు ఎన్టీఆర్‌లకు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌లను ఇచ్చాడు. ఇప్పటి వరకు కొరటాల శివ చేసిన ప్రతి సినిమా కూడా ఆ హీరోకు కెరీర్‌లో బెస్ట్‌ సక్సెస్‌గా నిలిచాయి. ప్రస్తుతం మహేష్‌బాబుతో ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని కొరటాల శివ చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివతో ఇంకా పలువురు హీరోలు కూడా సినిమా చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. 

korata-siva

‘జనతాగ్యారేజ్‌’ తర్వాత మరో సినిమాను కొరటాల శివతో సినిమాను చేసేందుకు ఎన్టీఆర్‌ సిద్దంగా ఉన్నాడు. ఇక చరణ్‌ రెండు సంవత్సరాలుగా కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నాడు. మరో వైపు నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్‌ కోసం కొరటాల శివ వెనుక పడుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అల్లు అర్జున్‌ కూడా కొరటాల శివతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఇటీవలే అల్లు అర్జున్‌ సన్నిహితులు స్వయంగా కొరటాలతో మాట్లాడుతూ బన్నీ కోసం ఒక చిత్రాన్ని చేయాలని, గీతాఆర్ట్స్‌లో భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించేందుకు అల్లు అరవింద్‌ సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నుగురు స్టార్‌ హీరోలు కొరటాల వెనుక క్యూలో ఉన్నారు. ఇక చిన్న హీరోలు అయితే కొరటాల దర్శకత్వంలో నటించేందుకు కలలు కంటున్నారు. భరత్‌ అను నేను చిత్రం తర్వాత కొరటాల చేయబోతున్న సినిమా ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది.