చాలామంది పెరుగును చీదరించుకుంటారు. వద్దని పక్కన పెట్టేస్తారు. కొందరు జలుబు చేస్తుందేమోనని భయపడి పెరుగుకు మరింత దూరంగా ఉంటారు. ఇంకొందరు పెరుగు తింటే బరువు పెరిగిపోతామనే భ్రమతో ఉంటారు. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తుంటే.. తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. పెరుగు వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. పెరుగు మన శరీరాన్ని కవచంలా కాపాడుతుంది. ఇప్పటివరకు పెరుగును దూరంగా పెట్టినవాళ్లు.. ఈ ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మెదడు చురుగ్గా పనిచేయడంలోనూ పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆహార నియమాల్లో పెరుగు, మజ్జిగకు ప్రత్యేక స్థానం కల్పిస్తే ఇక మంచి ఆరోగ్యం మీ సొంతం. మరి పెరుగు వల్ల కలిగే ఆ ప్రయోజనాలేమిటో చూసేద్దామా!
- పెరుగులో కాల్షియం భాస్వరం, ప్రోటీన్, లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు గట్టిపడతాయి.పెరుగు, ఎండుద్రాక్ష కలిపి తింటే శరీరానికి ఇ, ఎ, సి, బీ 2, బీ12 విటమిన్లతోపాటు కెరోటోనాయిడ్స్ అందుతాయి.పెరుగులో కాస్తా మిరియాల పొడి, బెల్లం పొడి కలిపి తింటే జలుబు నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.
- వాతం, కఫాలను తగ్గించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకుని తింటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. కానీ, అతిగా ఇలా తీసుకోవడం మంచిది కాదు.
- రోజూ పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.పెరుగులో అతిగా చక్కెరకు బదులు తేనె కలిపి తాగితే అల్సర్ తగ్గుతుంది. పెరుగు తేనే యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.
- పెరుగులో కాస్త పసుపు, కాస్త అల్లం కలిపి తింటే ఫోలిక్ యాసిడ్ శరరీంలోకి చేరుతుంది. పంటి సమస్యలు, నోటి పూత సమస్యలు వేదిస్తుంటే కప్పు పెరుగులో కొంచెం వాము వేసుకుని తింటే ఉపశమనం లభిస్తుంది.పెరుగులో ఓట్స్ కలిపి తింటే శరీరానికి ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాలకు మేలు చేస్తాయి.
- మజ్జిగలో కాస్తా నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర పొడి కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రస్తుతం ఉక్కపోత వేదిస్తోంది. ఎంతో నీరు శరీరం నుంచి బయటకు పోతుంది. ఇప్పుడు మజ్జిగ తాగితే డీహైడ్రేషన్ సమస్యలు ఉండవు. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తింటే మంచిది.
- శరీరంలో నీరు చేరినవారు పెరుగును ఎక్కవగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జిగట విరేచనాలతో బాధపడేవారు పెరుగులో కొంచెం మెంతులు కలుపుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.
- వేడి వేడి అన్నంలో పెరుగు కలుపుకని తింటే విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఎండుద్రాక్ష, పెరుగు కలిపి తాగితే పురుషుల్లో వీర్యకణాల నాణ్యత మెరుగవుతుందని ఓ పరిశోధనలో పేర్కొన్నారు. రోజూ పెరుగులో బెల్లం కలుపుకొని తింటే చలువ చేస్తుంది.
- పెరుగులో కాస్తా ఉప్పు కలుపుకుని తినడం వల్ల అజీర్తి సమస్యలు దరిచేరవు.కప్పు పెరుగులో నల్ల మిరియాల పొడిని కలిపి తింటే ఆహారం జీర్ణమవుతుంది.పెరుగులో వివిధ రకాల పండ్ల ముక్కలను కలిపి సలాడ్‌లా తింటే రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది.కీళ్ల నొప్పులతో బాధపడేవారు పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తాగితే మంచిది. మీరు బరువు తగ్గాలని భావిస్తే పెరుగుకు బదులు మజ్జిగ తాగండి.
- పెరుగు శక్తిని మాత్రమే కాదు.. ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. పెరుగు కంటే మజ్జిగ మేలు చేస్తుంది. ఇందులో నీరు కలపడం ద్వారా అందులోని ప్రోటీన్ విచ్ఛిన్నమై సులభంగా జీర్ణమవుతుంది. రోజూ పెరుగు కోసం అదనంగా అన్నం పెట్టుకుంటారు. ఆ అన్నానికి బదులు పెరుగును మజ్జిగలా తీసుకుంటే మంచిది.