‘పీఎం విశ్వకర్మ’ పథకం ప్రారంభం… అర్హతలివే

Start of 'PM Vishwakarma' scheme... Eligible
Start of 'PM Vishwakarma' scheme... Eligible

ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం నాడు శ్రీకారం చుట్టారు. మోడీ విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతివృత్తుల వారి కోసం రూ. 13 వేల కోట్లతో ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని ప్రారంభించారు. ద్వారకా సెక్టార్ 21 నుంచి 25 వరకు పొడిగించిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ లైన్ ను మోడీ ప్రారంభించారు. ప్రయాణికులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. వారితో సెల్ఫీలు దిగుతూ కాసేపు ముచ్చటించారు.

పీఎం విశ్వకర్మ.. అర్హులు, అర్హతలివే

18 ఏళ్లు పైబడిన చేతులు, టూల్ కిట్ల సాయంతో పనులు చేసుకునే వారు అర్హులు. ఆధార్, అడ్రస్, క్యాస్ట్ సర్టిఫికెట్,ఫోన్ నెంబర్, బ్యాంకు పాస్ బుక్, ఫోటో సాయంతో దరఖాస్తు చేయవచ్చు. వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, విగ్రహాల తయారీదారులు, చర్మకారులు, తాపీ మేస్త్రీలు, బాస్కెట్/నారతాళ్లు చేసేవారు, నాయి బ్రాహ్మణులు, పూలదండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీలు, చేప వలల తయారీదారులు అర్హులు.