ఏపీలో మరో మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోన్న నేపధ్యంలో పోలీస్ శాఖలో కీలక మార్పులు-చేర్పులు మొదలయ్యాయి. ఏపీ డీజీపీగా ఠాకూర్ స్థానంలో సీనియర్ ఐపీఎస్ గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోండగా రాష్ట్ర, ప్రభుత్వ భద్రతలో కీలకమైన ఇంటిలిజెన్స్ చీఫ్ బాధ్యతలు ఎవరికి దక్కబోతున్నాయన్న చర్చ మొదలయ్యింది. ఏపీ కేడర్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌ల పేర్లు తెరపైకి వస్తున్నా తెలంగాణలో హైదరాబాద్ రేంజ్ ఐజీగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ నుంచి రిలీవ్ చేసి డిప్యుటేషన్ పై ఏపీకి పంపమని జగన్ కేంద్ర హోం శాఖను కోరారని, ఆయన రాగానే ఏపీలో ఆయనకు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. స్టీఫెన్ రవీంద్ర గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ మధ్యనే ఏపీ ప్రభుత్వం డేటా చోరీకి పల్పదిందన్న ఆరోపణలతో తెలంగాణలో చోటు చేసుకున్న ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇంఛార్జ్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర వ్యవహరించారు. ఇక ఎన్నికల నాట వైసీపీ ఫిర్యాదు మేరకు ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే.