భారీ నష్టాలతో స్టాక్‌ మార్కెట్‌లు

భారీ నష్టాలతో స్టాక్‌ మార్కెట్‌లు

ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాలు దేశీయ మార్కెట్‌లపై ప్రభావం చూపింది. దీంతో బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.36 గంటల సమయానికి నిఫ్టీ 88.35 పాయింట్ల నష్టంతో 17955.90 వద్ద ట్రేడ్‌ అవుతుండగా..సెన్సెక్స్‌ 320పాయింట్ల నష్టపోయి 60113.36పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.

ఎంఅండ్‌ ఎం, యూపీఎల్‌, ఎథీర్‌ మోటార్స్‌, కిప్లా, సన్‌ ఫార్మా, టెక్‌ ఫార్మా, టెక్‌ మహీందద్రా, ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటాస్టీల్‌, హిందాల్కో, ఏషియన్‌ పెయింట్స్‌ , కొటాక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.