స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో మొదలైంది. క్రితం రోజు మార్కెట్లో కొనసాగిన జోరు ఈ రోజు ఉదయం కూడా కనిపించింది. ముఖ్యంగా సెన్సెక్స్ సూచీ లాభాల దిశగా వెళ్తుండగా నిన్న బ్యాంకు నిఫ్టీ అండతో జోష్‌లో కనిపించిన నిఫ్టీలో ఈ రోజు కూడా అది కొనసాగుతోంది.
ఉదయం 9:25 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లు లాభపడి 61,167 దగ్గర ట్రేడవుతుండగా నిఫ్టీ 29 పాయింట్లు లాభపడి 18,154 దగ్గర ట్రేడవుతోంది. మార్కెట్‌పై మరోసారి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తే రెండు దేశీ సూచీలు లాభాల బాట పట్టే అవకాశం ఉంది.
గత వారం 61 వేల పాయింట్లు క్రాస్ చేసి 61 వేల దిశగా పయణించి కిందికి పడిపోయిన సెన్సెక్స్ మరోసారి 61 వేలు క్రాస్ చేసింది. సెన్సెక్స్ 61 వేల స్థిరపడే అవకాశం ఉందని మార్కెట్ పండితుల అంచనా.