స్టాక్‌మార్కెట్‌లో బేర్ పంజా విసిరింది. మార్కెట్ నిపుణుల అంచనాలను నిజం చేస్తూ ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించేందుకు మొగ్గు చూపారు. దీంతో ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచే దేశీ సూచీలు వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. ముఖ్యంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ రికార్డు స్థాయిలో వెయ్యి పాయింట్లు నష్టపోయింది. దీంతో 58 వేల దిగువకు వచ్చింది.
మరోవైపు నిఫ్టీలో సైతం పతనం కొనసాగుతోంది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నిఫ్టీ 308 పాయింట్లు నష్టపోయి 17,456 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 1102 పాయింట్లు కోల్పోయి 58,534 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. సాయంత్రం ముగిసే సరికి మార్కెట్ మరింతగా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.