వరుస నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

వరుస నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ద్రవ్యోల్బణ ఆందోళనలు, యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల భయాలతో వరుసగా స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం మార్కెట్లు అత్యంత స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

అయితే కొద్ది సేపటికే అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడడంతో నష్టాల బాట పట్టాయి.ఉదయం 9.24 నిమిషాల సమయానికి సెన్సెక్స్‌ 24 పాయింట్ల నష్టంతో 59389 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ కొనసాగిస్తుంటే నిఫ్టీ సైతం 20 పాయింట్ల నష్టంతో 17712 వద్ద ట్రేడింగ్‌ కొనసాగుతుంది.

హిందాల్కో, అదానీ పోర్ట్‌, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, భారతీ ఎయిర్‌ టెల్‌, లార్సెన్‌ స్టాక్స్‌ లాభాల్లో కొనసాగుతుండగా..ఓన్‌జీసీ, సిప్లా, ఐఓసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.