“ఫ్రీ స్ట్రీమింగ్‌తో ప్రేక్షకుల ముందుకు ‘స్త్రీ 2′”…….!

"'Stree 2' in front of audience with free streaming".......!
"'Stree 2' in front of audience with free streaming".......!

ఈ ఏడాదిలో బాలీవుడ్ మూవీ నుంచి వచ్చిన పలు బిగ్గెస్ట్ హిట్ మూవీ ల్లో నటి శ్రద్ధా కపూర్ అలాగే రాజ్ కుమార్ రావు కాంబినేషన్ లో దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ క్రేజీ హారర్ కామెడీ థ్రిల్లర్ బాలీవుడ్ లో రికార్డ్స్ ని తిరగరాసింది. మరి ఈ మూవీ దాదాపు 8 వారాల రన్ తర్వాతే ఓటిటిలోకి వచ్చింది. అయితే మొదటిగా మేకర్స్ ఈ మూవీ ని రెంటల్ గా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. అయితే ఇలా కాకుండా ఫ్రీ స్ట్రీమింగ్ కోసం ఇప్పుడు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూసారు.

"'Stree 2' in front of audience with free streaming".......!
“‘Stree 2’ in front of audience with free streaming”…….!

అయితే ఫైనల్ గా నేడు ఈ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ మూవీ ఓటిటి హక్కులని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నేటి నుంచి ఈ మూవీ హిందీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ మూవీ ని చూడాలి అనుకునేవారు ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు. ఇక ఈ మూవీ లో పంకజ్ త్రిపాఠి, టాలెంటెడ్ యువ నటుడు అభిషేక్ బెనర్జీ తదితరులు నటించారు.