ఫోన్‌లో మాట్లాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటన వివరాల ప్రకారం… బడంగ్‌పేట చంద్రవిహార్‌కాలనీకి చెందిన లక్ష్మయ్య కుమార్తె ప్రశాంతి (18) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రశాంతి తరచు ఫోన్ మాట్లాడుతుండడంతో అధిక సమయం ఫోన్‌లో మాట్లాడవద్దని తండ్రి పలుమార్లు మందలించాడు.
దీంతో మనస్తాపం చెందిన ప్రశాంతి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.