ప్రేమ పేరుతో ఓ యువకుడు విద్యార్థినిని కిడ్నాప్ చేశాడు. మండలంలోని తంగెడంచ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తంగెడంచ గ్రామానికి చెందిన కుర్వమల్లయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా మూడో కుమార్తె వాణి జూపాడుబంగ్లా మోడల్ స్కూల్‌లో పదోతరగతి చదువుతోంది.అదే గ్రామానికి చెందిన మాబాషా కుమారుడు షేక్ ఫరూక్ గౌండపనిచేస్తుంటాడు.
ఈ యువకుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధించేవాడు. ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పటంతో వారు ఆ యువకుడిని మందలించారు. అయితే శనివారం కూరగాయల కోసం బయటకు వెళ్లిన వాణిని..ఫరూక్ బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని పారిపోయాడు. గ్రామస్తులు గమనించి బాలిక తల్లిదండ్రులకు తెలియజేయటంతో వారు వెంటనే జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ మారుతీశంకర్ కేసు నమోదు చేసుకుని బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.