సుచీ లీక్స్ వివాదంలో ఇరుక్కుని చాలా కాలం పాటు సింగింగ్‌కు దూరమైపోయింది సుచిత్ర. అయితే తాజాగా ఆమె గురించి కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. సుచిత్ర సోదరి సునిత ఆమె గురించి మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు రాద్దాంతంగా మారాయి. సునితకు మతి స్థిమితం బాగోలేదు.
అయితే గురువారం సుచిత్ర ఇంట్లోవారికి చెప్పకుండా చెకప్ నిమిత్తం దగ్గర్లోని హాస్పటిల్‌కు వెళ్లారట. కొన్ని గంటలు అవుతున్నా సుచిత్ర ఇంటికి రాకపోవడంతో తన చెల్లెలు కనిపించడంలేదని, ఎప్పటినుంచో సూసైడ్ చేసుకోవాలని అనుకుంటోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు సుచిత్ర ఫోన్ కాల్స్ ట్రేస్ చేసి ఆమె అన్నానగర్‌లోని ఓ క్లీనిక్‌లో ఉన్నట్లు తెలిసింది. దాంతో వెంటనే సునిత, పోలీసులు క్లీనిక్‌కు చేరుకున్నారు.
అయితే డాక్టర్లు సుచిత్రకు చెకప్ చేసి ఆమెలో ఎలాంటి సమస్యలు లేవని మామూలుగా ఉందని తెలిపారు. ఇదంతా మతి స్థిమితం లేని తన సోదరి చేయడం వల్ల వచ్చిన గొడవ అని సుచిత్ర పోలీసులకు తెలపడంతో వారు కేసును కొట్టివేశారు. ఆ తర్వాత ఫ్యాన్స్ కోసం సుచిత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
‘ఫ్రెండ్స్ నేను మిస్సవ్వలేదు, సూసైడ్ చేసుకోలేదు. బాగానే ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, దురదృష్టవశాత్తు నా సోదరి మీడియా ముందుకు వచ్చి ఏవేవో చెప్పడం వల్ల ఈ గొడవ మొదలైంది. నా సోదరి చెప్పినట్లు నేనెక్కడ ఆత్మహత్య చేసుకుంటానోనని భావించిన పోలీసులు నన్ను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని వైద్యులు చెప్పగానే వారు నన్ను ఇంట్లో దింపి వెళ్లిపోయారు’ అని క్లారిటీ ఇచ్చారు.