పదేళ్ళ తర్వాత కలయిక ఇది !

ఒక వైపున కన్నడలో స్టార్ హీరోగా కొనసాగుతూనే, మరో వైపున ఇతర భాషా చిత్రాల్లోను సుదీప్ ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. తాజాగా ఆయన ‘సైరా’ సినిమాలోను ఒక ముఖ్యమైన పాత్రను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రాజగురువు ‘గోసాయి వెంకన్న’ పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా సెట్లో అమితాబ్ తో కలిసి తాను దిగిన ఒక ఫొటోను సుదీప్ తన ట్విట్టర్లో షేర్ చేశాడు. ‘రణ్’ తరువాత పదేళ్లకు ఇలా లెజెండ్ అమితాబ్ తో కలిసి తెరను పంచుకునే అదృష్టం కలిగింది. అందుకు కారకులైన రామ్ చరణ్ కి సురేందర్ రెడ్డికి .. ఈ సినిమా టీమ్ కి నా ధన్యవాదాలు. థ్యాంక్యూ అమితాబ్ బచ్చన్ గారూ మీ ప్రేమాభిమానాలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి” అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు.