విశాల్ సగం పెళ్లి అయినట్టే !

సినీ నటుడు విశాల్, అనీశాల వివాహ నిశ్చితార్థం హైదరాబాదులో అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు, సన్నిహిత మిత్రులు మాత్రమే ఎంగేజ్ మెంట్ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. బంగారు వర్ణపు చీరలో అనీశా పెళ్లి కూతరుగా ముస్తాబు కాగా.. షార్ట్ హెయిర్ కట్‌తో సాంప్రదాయ దుస్తుల్లో విశాల్ సిగ్గు పడుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. విశాల్ – అనీశా రెడ్డి నిశ్చితార్థ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న విశాల్- అనీశా పెళ్లి బంధంతో ఒకటవ్వాలనే నిర్ణయానికి పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో పెళ్లికి రెడీ అయ్యారు. ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో అంగరంగ వైభవంగా వివాహం జరగనున్నట్టు సమాచారం. వీరి ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.