ఓ బేబీ సమంతా….వచ్చేస్తోంది !

96 Movie Telugu Remake By Samantha Akkineni

సమంత ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఓ బేబీ’, డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మహిళా ఓరియెంటెడ్‌ మూవీ. ఇది కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రాన్నీ’కి రీమేక్‌. ఈ సినిమా తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పేర్కొంది. ‘ నేను చాలా అదృష్టవంతురాలిని. నేను వెళ్లే మార్గాన్ని నిర్ధేశించడానికి దేవుడు, ప్రజలు సాయం చేశారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎదగడానికి కొంత సమయం తీసుకున్నా. ఈ క్రమంలో చాలా ఎత్తుపల్లాలనే చూశా. కానీ ఈ రోజు నా ఎదుగుదల చూస్తే చాలా సంతృప్తిగా ఉంది. నేను చేస్తున్న మరో సినిమా ‘ఓ బేబీ’ చిత్రీకరణ పూర్తయింది. ఇది నా హృదయానికి దగ్గరైన ప్రత్యేక చిత్రం. ఈ చిత్రంలో నా ప్రియమైన దర్శకురాలు నందినీ రెడ్డి ఫేవరెట్‌ పాత్ర ఇచ్చారు. జీవితంలో ‘బేబీ’లా ఉండే రెండో ఛాన్స్‌ ఉంటే నేను ఆమెలా ఉంటాను. ఆమె నాలా ఉంటుంది. ఈ వేసవికి ఈ సినిమా విడుదల కానుంది” అని పేర్కొంది సమంత. ఈ సినిమాకి మాటలు లక్ష్మీ భూపాల్ అందిస్తున్నారు.