అయ్య బాబోయ్… ఒకేసారి 5 సినిమాలా..!

Sudheer Babu starts 5 movies at a time

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన మహేష్ బావ సుధీర్ బాబు యువ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా శమంతకమణి సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరించిన సుధీర్ బాబు ప్రస్తుతం గోపిచంద్ బయోపిక్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఇవే కాకుండా ఒకేసారి 5 సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి రికార్డ్ సృష్టిస్తున్నాడు సుధీర్ బాబు.

Sudheer-Babu-next-movies

అందులో మోహనకృష్ణతో ఒక సినిమా ఉంటుందని తెలుస్తుండగా నటుడు రచయిత హర్షవర్ధన్ డైరక్షన్ లో కూడా ఒక సినిమాకు ఓకే చెప్పాడట సుధీర్ బాబు. ఈ సినిమా ఓ లవ్ థ్రిల్లర్ గా రాబోతుందని సమాచారం. వీటితో పాటుగా ఫాదర్ సెంటిమెంట్ తో రాజశేఖర్ అనే కొత్త దర్శకుడి కథను ఓకే చేశాడట సుధీర్ బాబు. ఈ సినిమాను సుధీర్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇంద్రసేన అనే నూతన దర్శకుడితో మరో సినిమా మొదలు పెడుతున్నాడట. చూస్తుంటే ఈ పాంచ్ పటాకాతో సుధీర్ స్టార్ట్ స్టేటస్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.