రంగస్థలం శాటిలైట్ రికార్డ్..!

Ram Charan's Rangasthalam 1985 satellite rights for 18 crores

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమా ప్రతి విషయంలో సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. సినిమాలో చరణ్ లుక్ సరికొత్త సర్ ప్రైజ్ కాగా ఇప్పుడు సినిమా రిలీజ్ కు ఐదు నెలలు ఉండగానే శాటిలైట్ హక్కులతో ఈ సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది. సుకుమార్ చరణ్ కాంబినేషన్ లో సినిమా అనగానే రంగస్థలం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సినిమా శాటిలైట్ రైట్స్ అత్యధికంగా 18 కోట్లకు దక్కించుకుందట ప్రముఖ ఛానెల్.

Rangasthalam-1985-satellite

నాన్ బాహుబలి సినిమాల్లో పవన్ త్రివిక్రం సినిమా అజ్ఞాతవాసి (వర్కింగ్ టైటిల్) 21 కోట్లకు శాటిలైట్ అవగా ఆ తర్వాత సెకండ్ టాప్ గా చరణ్ రంగస్థలం 18 కోట్లకు అమ్ముడయ్యింది. సినిమా మీద ఏ రేంజ్ అంచనాలున్నాయో ఈ శాటిలైట్ రికార్డులను చూసే చెప్పొచ్చు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. బుల్లితెర అందాల భామ అనసూయ కూడా ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. శాటిలైట్ రైట్స్ లో రికార్డ్ ప్రైజ్ పలికిన చరణ్ రంగస్థలం ఇదే హంగామా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ పై చూపిస్తుందని ఆశిద్దాం.