బుల్లితెర ప్రేక్షకులకు షాకిస్తూ సుధీర్ ఎంగేజ్‌మెంట్ వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ షో సుధీర్ ఎంగేజ్‌మెంట్ అంటూ వీడియోను వదిలారు. దీంతో ఇది కాస్తా ప్రస్తుతం నెట్టంట హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి ఇది నిజమైన నిశ్చితార్థమా? లేక ఎప్పటిలాగే ఫేకా.. అంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అయితే ఈసారి సుధీర్ ఎంగేజ్‌మెంట్ పరిశ్రమకు సంబంధం లేని అమ్మాయితో జరగడం, ఉంగరాలు కూడా మార్చుకోవడంతో మెజారిటీ పీపుల్ ఇది నిజమే అంటున్నారు. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలంటున్నాయి సన్నిహిత వర్గాలు.
ఇదిలా ఉంటే సుధీర్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఆ అమ్మాయి ఎవరాని? అందరు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ వీడియోతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదని, ఇంతకి పరిశ్రమకు చెందిన అమ్మాయేనా? అని చర్చించుకుంటున్నారు. అంటే ఇంతకాలం సుధీర్ సీక్రెట్ లవ్‌ట్రాక్ నడిపాడా? అంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ అమ్మాయి గురించిన వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఇంతకి ఆ అమ్మాయి ఎవరంటే.. ఆమె పేరు తేజస్వీ నాయుడు. తను ఒక మోడల్.. పలు యాడ్స్‌లో కూడా నటించిందట. కానీ ఆమె ఇండస్ట్రీలో పెద్దగా ఎవరికి తెలియదు. ఆడపడదడపా యాడ్స్‌లో నటిస్తున్న ఆమె సుధీర్‌తో ఎంగేజ్‌మెంట్ వీడియోతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.
అయితే ఈ వీడియో చూసిన సుధీర్-రష్మి గౌతమ్ ఫ్యాన్స్ కాస్తా నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ఈవెంట్‌లో సుధీర్-రష్మిల ఫేక్ ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అది అబద్ధమైన వారి ఫ్యాన్స్‌కు మాత్రం కనువిందు ఇచ్చింది. దీంతో బుల్లితెరపై లవ్లీ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. నిజంగానే వీరిద్దరూ రియల్ కపుల్ అయితే బాగుండని ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు వారి ఫ్యాన్స్ కూడా ఆశపడ్డారు. లేట్ అయినా వీరిద్దరూ ఒక్కటవుతారని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మరో అమ్మాయితో సుధీర్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ వీడియో అందరిని షాక్‌కు గురిచేస్తోంది. దీంతో ఇది నిజమా? అబద్ధామా? అని తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు.