ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్తత

ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్తత

ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ రైతు కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. దీంతో ప్రగతి భవన్ దగ్గర హల్చల్ చోటు చేసుకుంది. శామీర్ పేట్ ఇన్‌స్పెక్టర్ తమ భూమి వివాదంలో అన్యాయం చేస్తున్నాడని భిక్షపతి అనే రైతు యొ కుటుంబం ఆరోపణలు వ్యక్తం చేస్తుంది. శామీర్ పేట్ ఇన్‌స్పెక్టర్ వేధింపుల తట్టుకోలేక ప్రగతి భవన్ వద్ద బిక్షపతి అనే రైతు తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని చూశాడు. శామీర్ పెట్ మండలంలోని కొత్తూరు గ్రామంలో ఉన్న 1.30 గుంటల భూమిని అక్కడి పోలీస్ అధికారి వేరే వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బిక్షపతి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం అయిన ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ ప్రాంతమంతా కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కిరోసిన్ పోసుకుని రైతు బిక్షపతి అతని భార్య ఆత్మహత్య యత్నం చేశారు. అప్రమత్తం అయిన పోలీసులు వెంటనే కిరోసిన్ పోసుకున్న భిక్షపతి పైన నీళ్లు పోశారు. భిక్షపతిని అతని భార్య బుచ్చమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.